Internet Services: ఫైబర్‌నెట్ నిర్వహణకు ఎయిర్‌టెల్ ఆసక్తి
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:23 AM
రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవల నిర్వహణ చేపట్టేందుకు ఎయిర్‌టెల్‌తో సహా పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఫైబర్ నెట్ సేవలను వినియోగదారులకు అందించేందుకు ఆసక్తి....
మరో ఐదు సంస్థలు కూడా ముందుకు
15 వరకు బిడ్ గడువు పెంచిన ఫైబర్‌నెట్
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవల నిర్వహణ చేపట్టేందుకు ఎయిర్‌టెల్‌తో సహా పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఫైబర్ నెట్ సేవలను వినియోగదారులకు అందించేందుకు ఆసక్తి చూపే సంస్థల కోసం పిలిచిన బిడ్ గడువు సోమవారంతో ముగిసింది. ఆ గడువులోగా ఆరు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో కార్పస్, ఎస్‌ఆర్‌ఐటీ బెంగళూరు, రైల్ ఇండస్ట్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్‌టెల్, సిటీ ఆన్‌లైన్, డిష్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ సంస్థలున్నాయి. ప్రసారాలను వినియోగదారులకు అందించినందుకు వసూలు చేసిన నెలవారీ కలెక్షన్ రుసుము నుంచి కొంత ఫైబర్ నెట్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరిన్ని సంస్థలు బిడ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఫైబర్ నెట్ ఆ గడువును ఈ నెల 15 వరకు పెంచింది.