Share News

వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:50 PM

వాయు కాలుష్యం నియంత్రణకు ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన డాక్టర్‌ మారూఫ్‌ ఆసియా అన్నారు.

వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి
ఆత్మకూరులో ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన, అధికారులు

ఆత్మకూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): వాయు కాలుష్యం నియంత్రణకు ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన డాక్టర్‌ మారూఫ్‌ ఆసియా అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాయు కాలుష్యం గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండ్‌ ప్రాంగణంలో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన మాట్లాడుతూ.. ప్రపంచీకరణలో భాగంగా నానాటికి వాయు కాలుష్యం అధికమై ప్రజలు రోగాల బారిన పడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. వీటి నియంత్రణకు ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ రవికుమార్‌, ఏఈ ఓబులేసు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పగిడ్యాల: కాలుష్యాన్ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని జడ్పీటీసీ సభ్యురాలు పుల్యాల దివ్య, ఎంపీడీవో సుమిత్రమ్మ సూచించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పగిడ్యాల ఎంపీడీవో కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ ఆవరణంలో మానవహారం ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తహసీల్దారు శివరాముడు, ఏపీవో మద్దిలేటి, ఏపీఎం చంద్రకళ, ఎంఈవో సుభాన, సచివాలయ సిబ్బంది, అంగనవాడీలు, పారిశుధ్యకార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మిడుతూరు: మండల కేంద్రం మిడుతూరులో ప్రాజెక్టు డైరెక్టర్‌ డీఆర్డీఏ శ్రీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడ్డారు. ప్రతి ఇంటి మీద సోలార్‌ ప్లాంట్లు బిగించుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్‌ డిఆర్డిఏ శ్రీధర్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసులు, ఎంపీడీవో దశరథ రామయ్య, సర్పంచు జయలక్ష్మమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:50 PM