Gannavaram: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:52 AM
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి గురువారం గన్నవరంలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం ఎయిర్‌పోర్టు నుంచి 97 మంది ప్రయాణికులతో విమానం బెంగళూరుకు బయలుదేరింది.
గన్నవరం, మడకశిర టౌన్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి గురువారం గన్నవరంలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం ఎయిర్‌పోర్టు నుంచి 97 మంది ప్రయాణికులతో విమానం బెంగళూరుకు బయలుదేరింది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. పైలెట్ అప్రమత్తమై సడెన్ బ్రేక్ వేశారు. విమానాన్ని తిరిగి ఆప్రాన్‌కు మళ్లించారు. ఏం జరిగిందో తెలియని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఇదే విమానంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు.