Agreement Signed: మూత్ర సంబంధ వ్యాధులపై వైద్య పరిశోధనలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:00 AM
రాష్ట్రంలో మూత్ర సంబంధిత వ్యాధులు నియంత్రణకు ఇండియన్ మెడికల్ అపోసియేషన్(ఐఎంఏ) ఏపీ శాఖ నడుం బిగించింది....
ఐఎంఏతో అమెరికా సంస్థ ఇప్త్సెటీ ఒప్పందం
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూత్ర సంబంధిత వ్యాధులు నియంత్రణకు ఇండియన్ మెడికల్ అపోసియేషన్(ఐఎంఏ) ఏపీ శాఖ నడుం బిగించింది. దీనికోసం అమెరికాకు చెందిన ఇప్సైటీ రిసెర్చ్ సెంటర్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిశోర్ తెలిపా రు. గుంటూరులోని ఐఎంఏ హాల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమం లో డాక్టర్ నందకిశోర్, ఇప్సైటీ రిసెర్చ్ సెంటర్ సీఈవో డాక్టర్ సందీప్ నాదెండ్ల ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. డాక్టర్ నందకిశోర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాల యూరిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న 300 మంది నుంచి మూత్ర నమూనాలు సేకరించి అత్యంత ఖరీదైన అతి సూక్ష్మస్థాయి మాలిక్యులర్ పీసీఆర్ పరీక్షలు, వివిధ మందుల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సంబంధ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా చేసే పరిశోధనల్లో ఈ ఇన్ఫెక్షన్లను ఏ యాంటీబయాటిక్స్ పూర్తిగా నియంత్రిస్తాయో తెలుస్తుందన్నారు. ఇప్సైటీ రిసెర్చ్ సెంటర్ సీఈవో డాక్టర్ సందీప్ నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో అత్యాధునిక వైద్య పరీక్షలు, పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.