ఫినలాండ్ ఎడ్యుకేషన విధానానికి ఒప్పదం
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:43 PM
ప్రపంచ అత్యుత్తమ విద్యావిధానం కలిగిన ఫినలాండ్ ఎడ్యుకేషనను తమ విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టేందుకు ఫినలాండ్ కోడ్ స్కూల్ చైౖర్మన కైసు పల్లాస్కాలియోతో ఒప్పందం చేసుకున్నట్లు శాంతినికేతన విద్యాసంస్థల అధినేత సుధాకర్ తెలిపారు.
నంద్యాల ఎడ్యుకేషన, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ అత్యుత్తమ విద్యావిధానం కలిగిన ఫినలాండ్ ఎడ్యుకేషనను తమ విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టేందుకు ఫినలాండ్ కోడ్ స్కూల్ చైౖర్మన కైసు పల్లాస్కాలియోతో ఒప్పందం చేసుకున్నట్లు శాంతినికేతన విద్యాసంస్థల అధినేత సుధాకర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ దుబాయ్‌లో జరిగిన ఫీచర్ ఎడ్యుకేషన- 2025 కార్యక్రమంలో నంద్యాల శ్రీ శాంతినికేతన, శ్రీ సంకల్ప్ విద్యాసంస్థల్లో ఫినలాండ్ ఎడ్యుకేషన విధానం అమలు పరిచేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు వివరించారు. ప్రపంచస్థాయి విద్యావిధానం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడానికి, మెరుగైన ఫలితాలను సాధించడానికి ఉపకరిస్తుందన్నారు.