Share News

Aerospace Investments: రాష్ట్రంలో పెట్టుబడులకు ఏరోస్పేస్‌ సంస్థ ఆసక్తి

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:02 AM

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు డ్రోన్‌, ఏరో స్పేస్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి.

Aerospace Investments: రాష్ట్రంలో పెట్టుబడులకు ఏరోస్పేస్‌ సంస్థ ఆసక్తి

  • మంత్రి జనార్దనరెడ్డితో త్సల్లా ప్రతినిధులు భేటీ

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు డ్రోన్‌, ఏరో స్పేస్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఏపీలో డ్రోన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ త్సల్లా ఏరోస్పేస్‌ చెప్పింది. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రి బీసీ జనార్దనరెడ్డిని త్సల్లా ఏరోస్పేస్‌ ప్రతినిధుల కలసి తమ ఆసక్తిని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్దంగా ఉన్నామని, వచ్చే ఐదేళ్లలో రూ. 550 కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు.

Updated Date - Dec 12 , 2025 | 05:04 AM