Dredge Godavari: డ్రెడ్జ్ గోదావరి రెడీ!..
ABN , Publish Date - Oct 19 , 2025 | 02:58 AM
విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నూతనంగా సమకూర్చుకున్న ‘డ్రెడ్జ్ గోదావరి’ నౌక సేవలకు సిద్ధమైంది...
కొచ్చిలో అధునాతన డ్రెడ్జర్ నౌక ప్రారంభం
విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) నూతనంగా సమకూర్చుకున్న ‘డ్రెడ్జ్ గోదావరి’ నౌక సేవలకు సిద్ధమైంది. విశాఖపట్నం పోర్టు, డీసీఐల సంయుక్త చైర్మన్ ఎం.అంగముత్తు, కొచ్చి పోర్టు చైర్మన్ విశ్వనాథన్‌తో కలిసి దీనిని కొచ్చిన్ షిప్‌యార్డులో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచంలోని బీగల్ సిరీ్‌సలో 12వేల ఘనపు మీటర్ల సామర్థ్యం కలిగిన.. అత్యంత అధునాతన డ్రెడ్జర్లలో ఇదే మొదటిది కావడం విశేషం. డీసీఐ రూ.800 కోట్ల ఖర్చుతో దీనిని ఆర్డర్ చేసింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా నిర్మితమైన ఈ నౌక అధిక సామర్థ్యం, కచ్చితత్వం, పర్యావరణ హితమైనదని పోర్టు చైర్మన్ అంగముత్తు వెల్లడించారు.