Share News

Change Maker Award: ఆదిత్య ప్రో చాన్సలర్‌ సతీశ్‌ రెడ్డికి ఎడ్యుకేషన్‌ చేంజ్‌ మేకర్‌ అవార్డు

ABN , Publish Date - Dec 31 , 2025 | 06:01 AM

ఆదిత్య యూనివర్సిటీ ప్రో చాన్సలర్‌ డాక్టర్‌ నల్లమిల్లి సతీశ్‌ రెడ్డి ఐసీటీ అకాడమీ నుంచి ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషన్‌ చేంజ్‌ మేకర్‌ అవార్డు అందుకున్నారు.

Change Maker Award: ఆదిత్య ప్రో చాన్సలర్‌ సతీశ్‌ రెడ్డికి ఎడ్యుకేషన్‌ చేంజ్‌ మేకర్‌ అవార్డు

గండేపల్లి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆదిత్య యూనివర్సిటీ ప్రో చాన్సలర్‌ డాక్టర్‌ నల్లమిల్లి సతీశ్‌ రెడ్డి ఐసీటీ అకాడమీ నుంచి ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషన్‌ చేంజ్‌ మేకర్‌ అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీటీ అకాడమీ సంస్థ 71వ బ్రిడ్జ్‌ కాన్ఫరెన్స్‌ మంగళవారం విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు అవార్డును ప్రదానం చేసింది. అవార్డు అందుకున్న డాక్టర్‌ సతీశ్‌ రెడ్డికి ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌, ఆదిత్య యూనివర్సిటీ చాన్సలర్‌ డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యలో అసాధారణ నాయకత్వాన్ని, విద్యా నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆదిత్య యూనివర్సిటీ అనుసరిస్తున్న ప్రభావవంతమైన ప్రయత్నాలను అభినందిస్తూ ఐసీటీ అకాడమీ బోర్డు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ప్రదానం చేసిందని తెలిపారు.

Updated Date - Dec 31 , 2025 | 06:02 AM