Share News

AP Govt: ఆర్టీఈ కోటా సీట్లకు అదనపు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 05:39 AM

రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద కేటాయించిన 25 శాతం సీట్లలో ఈ ఏడాది కొన్ని సీట్లు మిగిలిపోయాయి.

AP Govt: ఆర్టీఈ కోటా సీట్లకు అదనపు నోటిఫికేషన్‌

  • మిగిలిన సీట్ల భర్తీకి 12 నుంచి దరఖాస్తులు

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద కేటాయించిన 25 శాతం సీట్లలో ఈ ఏడాది కొన్ని సీట్లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఒకటో తరగతిలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం శనివారం అదనపు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అడ్మిషన్ల కోసం ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తులను పరిశీలించి 21న విద్యార్థుల అర్హతను నిర్ధారిస్తారు. 25న లాటరీ ద్వారా ఫలితాలను ప్రకటిస్తారు. 31న పాఠశాలల్లో అడ్మిషన్లను ఖరారు చేస్తారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ అదనపు నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Aug 10 , 2025 | 05:41 AM