Share News

AP Govt: గోదారి వరద ప్రభావిత జిల్లాలకు అదనపు నిధులు

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:11 AM

గోదావరి వరద ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసింది.

AP Govt: గోదారి వరద ప్రభావిత జిల్లాలకు అదనపు నిధులు

  • రూ.12.85 కోట్లు మంజూరు

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు రూ.12,85, 93,273 మంజూరు చేసింది. ఇందులో నిత్యావసర వస్తువుల పంపిణీకి రూ.4,93,46,273, కుటుంబానికి రూ.3వేలు చొప్పున ప్రత్యేక నగదు సాయం కింద రూ.7,61,37,000, దెబ్బతిన్న గృహాలకు రూ.31,10,000 కేటాయించింది. అల్లూరి జిల్లాకు రూ.12,04,89, 235, తూర్పు గోదావరికి రూ.8,83,890, ఏలూరు జిల్లాకు రూ.69,74,148, కోనసీమకు రూ.2,46,000 మంజూరు చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులుజారీ చేశారు.

Updated Date - Dec 10 , 2025 | 05:11 AM