Government Orders: సచివాలయ ఉద్యోగులకు అదనపు పనులు
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:41 AM
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారికి నిర్దేశించిన సాధారణ జాబ్‌చార్ట్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించి అదనపు పనులు కూడా నిర్వహించాల్సి ఉంటుందని...
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారికి నిర్దేశించిన సాధారణ జాబ్‌చార్ట్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించి అదనపు పనులు కూడా నిర్వహించాల్సి ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు పౌరుల డేటా సేకరించేందుకు ఆయా సచివాలయ ఉద్యోగులు సహకరించాలని, పౌరులకు ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు, సేవలు చేర్చాలని, సచివాలయాలకు వచ్చిన విజ్ఞప్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, విపత్తులు సంభవించినప్పుడు సిబ్బంది హాజరు కావాలని, ప్రభుత్వం అప్పగించే బాధ్యతలను ఎప్పటికప్పుడు నెరవేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తెలిపారు.