Share News

Excise Department: బార్లపై తగ్గనున్న అదనపు ఏఆర్‌ఈటీ భారం

ABN , Publish Date - Sep 30 , 2025 | 06:00 AM

బార్లపై అదనంగా విధిస్తున్న ఏఆర్‌ఈటీ పన్ను అంశంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంగళగిరిలోని ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఈ సమావేశం జరిగింది.

Excise Department: బార్లపై తగ్గనున్న అదనపు ఏఆర్‌ఈటీ భారం

  • మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చ

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): బార్లపై అదనంగా విధిస్తున్న ఏఆర్‌ఈటీ పన్ను అంశంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంగళగిరిలోని ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇందులో పాల్గొనగా... మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, కొండపల్లి శ్రీనివాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అదనపు ఏఆర్‌ఈటీతోపాటు మైక్రో బ్రూవరీ, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం, ప్రీమియం లిక్కర్‌ స్టోర్లు అంశాలపై చర్చించారు. ఉపసంఘం సిఫారసులను త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటారు. బార్‌లకు విధిస్తున్న 15శాతం అదనపు ఏఆర్‌ఈటీని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. తగ్గించిన పన్నును మద్యం షాపులకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల మద్యం ధరలు స్వల్పంగా పెరగొచ్చు.

Updated Date - Sep 30 , 2025 | 06:02 AM