కార్యకర్తలే పార్టీకి కీలకం
ABN , Publish Date - May 26 , 2025 | 12:07 AM
టీడీపీకి కార్యకర్తలే కీలక మని ఆళ్లగడ్డ ఎ మ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నా రు.
చాగలమర్రి, మే 25 (ఆంధ్ర జ్యోతి): టీడీపీకి కార్యకర్తలే కీలక మని ఆళ్లగడ్డ ఎ మ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నా రు. ఆదివారం మండలంలోని గొ డిగనూరులో పెద్ద మ్మతల్లి జాతరలో పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు శేఖర్‌రెడ్డి ని వాసంలో ఆమె మాట్లాడుతూ కడపలో జరిగే మహానాడును విజయ వంతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. మహానా డును విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని, ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయ కులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నరసింహరెడ్డి, టీడీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, సూర్యనారాయణ, రామసుబ్బయ్య, నరసింహ, బ్రహ్మానందరెడ్డి, నరేంద్రారెడ్డి, నర్సిరెడ్డి, ప్రమోద్‌కుమార్, రమేష్, రామచంద్రారెడ్డి, హరిశ్చంద్రారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
సుబ్బరాయుడు మృతి బాధాకరం
పెద్దబోధనం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం బాధాకరమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. కు టుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుబ్బరాయుడు అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేలు సాయం అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.