కార్యకర్తలే పార్టీకీ పట్టుగొమ్మలు: ఎమ్మెల్యే బుడ్డా
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:35 PM
తెలుగదేశం పార్టీకీ కార్యకర్తలే పట్టు కొమ్మలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
వెలుగోడు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : తెలుగదేశం పార్టీకీ కార్యకర్తలే పట్టు కొమ్మలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఆదివారం వేల్పనూరులోని ఎమ్మెల్యే స్వగృహంలో ఉత్తమ కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి పార్టీ అభివృద్ధి కోసం పాటు పడాలని అన్నారు. అభివృద్ధిని విస్మరించి శవ రాజకీయాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. జగన ఏనాడు తమ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని, పార్టీ కార్యకర్తలే అధినేత లని ప్రకటించిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. అనంతరం పార్టీకి విశేష సేవలందించిన వారిని ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి అభినం దించి అవార్డులతో సత్కరించారు. సమావేశంలో అబ్దుల్‌కలాం, అబ్దు ల్లాపురం బాషా, భూపాల్‌చౌదరి, జూటూరు క్రిష్ణారెడ్డిలతో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: మండలంలోని బీ కోడూరు గ్రామానికి చెందిన ఇరగదిండ్ల బాలుడకు ఉత్తమ కార్యకర్త జ్ఞాపికను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు డాక్టర్ చిట్టిబొట్ల భరద్వాజశర్మ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చలమయ్య, పలువురు స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.