శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:41 AM
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ హెచ్చరిం చారు.
ఆళ్లగడ్డ/కోవెలకుంట్ల, జూన 15 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ హెచ్చరిం చారు. ఆదివారం తెల్లవారు జామున ఆళ్లగడ్డ సబ్ డివిజనలోని కోవెల కుంట్ల, శిరివెళ్ల, ఆళ్లగడ్డ పోలీస్‌స్టేషన్ల పరిధిలో కార్డనసెర్చ్ నిర్వహించా రు. డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన కంపమల గ్రామంలో బెల్ట్ షాపుల నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శిరివెళ్ల మండలం పెద్దకంబలూరులో సరైన పత్రాలు లేని తొమ్మిది ద్విచక్ర వాహనాలు, కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన పరిధిలోని తుమ్మలపెంటలో 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మూడు గ్రామాల్లో రౌడిషీటర్ల, అనుమానితులు, నేర చరిత్రగల వారి నివాసాలలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఆయా గ్రామాలలోని ప్రధాన కూడళ్లలో ప్రజలతో సమావేశాలు నిర్వహించి నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైం, రోడ్డు ప్రమాదాలు, మహిళలు, చిన్నారులపై జరిగే ఆఘాయిత్యాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.