పార్కుల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:58 AM
నగరంలోని పార్కుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం శాఖ మంత్రి టీజీ భరత
కర్నూలు న్యూసిటీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): నగరంలోని పార్కుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అధికారులను ఆదేశించారు. బుధవారం 16వ వార్డు బుధవారపేటలోని దామోదరం సంజీవయ్య మైదానంలో నడకబాట, ఓపెన జిమ్, కిడ్స్‌ప్లే, పచ్చదనం, సుందరీకరణ పనులను మంత్రి టీజీ భరత, ఎంిపీ నాగరాజు, నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ బుధవారపేట ప్రాంతంలో జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ సేద తీరేందుకు ఒక్క ఆహ్లాదకరమైన ప్రదేశం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచు కుని చేపల గుంత మైదానంలో రూ.3.14 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నగర పరిధిలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, ఈవర్షా కాలంలో 4800 మొక్కలు కార్పొరేషన ద్వారా నాటించి నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎస్.శివమ్మ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌రెడ్డి, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి డా.కే.విశ్వేశ్వరరెడ్డి, డీఈఈ మనోహర్‌రెడ్డి, ట్రైనీ ఏఈ రామ్మోహన పాల్గొన్నారు.