Share News

తప్పు చేస్తే చర్యలు తప్పవు: ఏపీడీ

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:09 AM

తప్పు చేసిన అధికారు లపై చర్యలు తప్పవని ఉపాధి హామీ పథకం ఏపీడీ సాంబశివుడు హెచ్చరించారు.

 తప్పు చేస్తే చర్యలు తప్పవు: ఏపీడీ
విచారణ చేపడుతున్న ఏపీడీ సాంబశివుడు

కొలిమిగుండ్ల, జూన 23 (ఆంధ్రజ్యోతి) : తప్పు చేసిన అధికారు లపై చర్యలు తప్పవని ఉపాధి హామీ పథకం ఏపీడీ సాంబశివుడు హెచ్చరించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన మందు పార్టీతో ఉద్యోగుల హల్‌చల్‌ అనే కథనానికి ఏనఆర్‌ ఈజీఎస్‌ అధికా రులు స్పందించారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఏపీడీ సాంబశివుడు విచారణ చేపట్టారు. జిల్లా పీడీ ఆదేశాలమేరకు స్థానిక ఎంపీడీవో ప్రసాదరెడ్డితో కలిసి మందు పార్టీలో పాల్గొన్న ఉద్యోగుల ను విచారణ చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలకు సంబంధిం చిన వచ్చిన ఆరోపణలను లోతుగా విచా రణ చేపడుతున్నామని, పీడీకి నివేదిక అందజేస్తామన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:09 AM