Share News

చోరీ కేసులో నిందితుడు అరెస్టు

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:59 PM

నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన పరిధిలో ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

చోరీ కేసులో నిందితుడు అరెస్టు
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ బాబు ప్రసాద్‌

కర్నూలు క్రైం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి) : నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన పరిధిలో ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్‌, సీఐ విక్రమసింహ, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి, మోహన కిషోర్‌ రెడ్డి నిందితుని వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గున్న అంజి అనే యువకున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 16 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆర్టీసీ బస్టాండులో రద్దీగా ఉన్న బస్సుల వద్ద బస్సు ఎక్కే మహిళల పర్సులను చాకచక్యంగా అపహరించి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నాడు. నిందితునిపై పలు స్టేషనలలో కేసులు కూడా ఉన్నాయి. చోరీ చేసిన సొత్తులను పైనాన్స సంస్థల్లో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటాడు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Aug 10 , 2025 | 11:59 PM