Share News

DGP Harish Kumar Gupta: పోలీసు సిబ్బందికి ప్రమాద బీమా

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:40 AM

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందని డీజీపీ హరీశ్‌ కుమార్‌...

DGP Harish Kumar Gupta: పోలీసు సిబ్బందికి ప్రమాద బీమా

  • హోంగార్డుకు 10 లక్షలు.. కానిస్టేబుల్‌కు పాతిక లక్షలు

  • ఎస్‌ఐ నుంచి ఏఎస్పీ వరకూ 35 లక్షలు: డీజీపీ గుప్తా

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా అన్నారు. రోడ్డు, ఇతర ప్రమాదాలకు సంబంధించి పోలీసు సిబ్బంది, అధికారులు, హోంగార్డులకు గత ప్రభుత్వంలో ఆపేసిన గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ(జీపీఏఐ) సౌకర్యాన్ని పోలీసు శాఖ పునరుద్ధరించింది. సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో న్యూఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులకు రూ.7.68 కోట్ల చెక్కును డీజీపీ గుప్తా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంగార్డుకు రూ.10లక్షలు, కానిస్టేబుల్‌ నుంచి ఏఎ్‌సఐ వరకూ రూ.25లక్షలు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి అడిషనల్‌ ఎస్పీ వరకూ రూ.35 లక్షలు, ఆపై డీజీపీ హోదా వరకూ రూ.45లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు. ఈ పాలసీని ఏడాదిపాటు పునరుద్ధరించామన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 05:40 AM