ఇబ్రహీంపట్నం సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయ ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:23 AM
ఇబ్రహీంపట్నం సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇన్‌చార్జి సబ్ రిజిసా్ట్రర్ షేక్ మహమ్మద్‌కు చెందిన భవానీపురం టెలిఫోన్ కాలనీలోని ఇంట్లో, జూనియర్ అసిస్టెంట్ డి.పద్మకు చెందిన కొండపల్లిలోని నివాసంలో ఏకకాలంలో సోదాలు చేశారు.
-భవానీపురంలోని ఇన్‌చార్జి సబ్ రిజిసా్ట్రర్ ఇంట్లో రికార్డులు స్వాధీనం
-కొండపల్లిలోని జూనియర్ అసిస్టెంట్ ఇంట్లోనూ తనిఖీలు
-ఏకకాలంలో రెండు చోట్ల దాడులు నిర్వహించిన అధికారులు
ఇబ్రహీంపట్నం/విజయవాడ అర్బన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
ఇబ్రహీంపట్నం సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇన్‌చార్జి సబ్ రిజిసా్ట్రర్ షేక్ మహమ్మద్‌కు చెందిన భవానీపురం టెలిఫోన్ కాలనీలోని ఇంట్లో, జూనియర్ అసిస్టెంట్ డి.పద్మకు చెందిన కొండపల్లిలోని నివాసంలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సబ్ రిజిస్ర్టార్ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత మహమ్మద్ కుటుంబ సభ్యుల ఫోన్‌లను స్వాధీనం చేసుకుని బయటకు వెళ్లనీయకుండా నియంత్రించారు. పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు వివరాలు వెల్లడించలేదు. ఈ ఏడాది నవంబరు 5న ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నం సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో రెండు రోజుల పాటు విస్తృత సోదాలు చేసి మొదటి రోజు ఎలాంటి లెక్కలు లేని రూ.74 వేలను సీజ్ చేశారు. దాడుల్లో ఆ నగదు ఇన్‌చార్జి సబ్ రిజిసా్ట్రర్ మహమ్మద్ సమీపంలోనే లభించినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతడ్నే ఇన్‌చార్జి సబ్ రిజిసా్ట్రర్‌గా కొనసాగించారు. ఇప్పుడు ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అందుకే ఆయనను ఇన్నాళ్లు కొనసాగించి ఉంటారనే వాదన ఉంది.
ఇన్‌చార్జి సబ్ రిజిసా్ట్రర్‌గా శ్రీనివాసరావు
ఏసీబీ దాడుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి సబ్ రిజిసా్ట్రర్‌గా డి.శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్‌గా సాయిరాజును ఆ శాఖ లధికారులు నియమించారు.