Share News

Bail Rejected: చెవిరెడ్డికి చుక్కెదురు

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:02 AM

మద్యం కేసులో నిందితుడిగా ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది.

Bail Rejected: చెవిరెడ్డికి చుక్కెదురు

  • బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన ఏసీబీ కోర్టు

  • దిలీప్‌, చాణక్య పిటిషన్లపై విచారణ వాయిదా

విజయవాడ, జూలై 28(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో నిందితుడిగా ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. చెవిరెడ్డ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగియడంతో సోమవారం న్యాయాధికారి భాస్కరరావు తీర్పు వెలువరించారు. కాగా ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న పైలా దిలీప్‌, కోనేటి చాణక్య బెయిల్‌ పిటిషన్లు 30కి వాయిదా పడ్డాయి. ఇక 12 మంది నిందితులకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో ఉన్న 12 మంది నిందితులను అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలని సిట్‌ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.

Updated Date - Jul 29 , 2025 | 05:04 AM