Share News

ACB Court: మిథున్‌రెడ్డికి పాస్‌పోర్టు ఇవ్వండి

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:52 AM

మద్యం కుంభకోణంలో ఏ4గా ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టును ఆయనకు తిరిగి అప్పగించాలని విజయవాడ ఏసీబీ కోర్టు...

ACB Court: మిథున్‌రెడ్డికి పాస్‌పోర్టు ఇవ్వండి

సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం

మద్యం కేసులో ముంబై వాలా

నిందితుడిగా చేర్చేందుకు సిట్‌ పిటిషన్‌

విజయవాడ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ4గా ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టును ఆయనకు తిరిగి అప్పగించాలని విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. అమెరికాకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఎంపీల బృందంలో తానూ ఉన్నానని, అందువల్ల పాస్‌పోర్టును ఇప్పించాలని మిథున్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ముగియడంతో న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పును వెలువరించారు. మిథున్‌రెడ్డి విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టును ఇవ్వాలని సిట్‌ అధికారులను ఆదేశించారు. కాగా, మద్యం కుంభకోణంలో ముంబైకి చెందిన అనిల్‌ చోక్రా అనే వ్యక్తిని నిందితుడి (ఏ49)గా చేర్చడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

నిందితుల బెయిల్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు

మద్యం కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితుల బెయిల్‌ పిటిషన్లపై మళ్లీ వాదనలు వినిపించడానికి ప్రాసిక్యూషన్‌ దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌కు ఏసీబీ కోర్టు బుధవారం అనుమతి ఇచ్చింది. దీంతో తిరిగి గురువారం వాదనలను ప్రాసిక్యూషన్‌ వినిపిస్తుంది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాదనలు ముగిశాయి. తాము తిరిగి వాదనలు వినిపిస్తామని ప్రాసిక్యూషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - Oct 09 , 2025 | 05:53 AM