ACB: బిల్లులు ఆమోదించేందుకు 25 శాతం కమీషన్
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:45 AM
బిల్లులకు ఆమోదం తెలపాలంటే 25 శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను వేధింపులకు గురి చేసిన బాపట్ల జిల్లా రేపల్లె రేంజ్ అటవీ అధికారి రమణారావును...
కాంట్రాక్టర్ నుంచి రూ.1,25,000 లంచం డిమాండ్
ఏసీబీకి చిక్కిన రేపల్లె రేంజ్ అటవీ అధికారి
బాపట్ల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): బిల్లులకు ఆమోదం తెలపాలంటే 25 శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను వేధింపులకు గురి చేసిన బాపట్ల జిల్లా రేపల్లె రేంజ్ అటవీ అధికారి రమణారావును ఏసీబీ అధికారులు గురువారం వల పన్ని పట్టుకున్నారు. బాపట్ల మండలం ఆదర్శనగర్ సమీపంలో ఉన్న నగరవనం సుందరీకరణ పనుల్లో రూ.5.90 లక్షల బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని ఈ నెల 25న కాంట్రాక్టర్ కర్రి వీర్ల అంకయ్య ఖాతాల్లో జమయింది. ఇందులో రమణారావు లంచం డిమాండ్ చేశారు. ఇవ్వకపోయేసరికి సాంకేతిక అంశాల పేరుతో ఇబ్బంది పెట్టడంతో అంకయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నగర వనంలో రమణారావు రూ.1,25,000 లంచం తీసుకుంటుండగా గుంటూరు రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర సారథ్యంలోని బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గుంటూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.