Aksharam Andaga: సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - May 22 , 2025 | 04:30 AM
సమస్యలు మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ ముందుకొచ్చింది. ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేశారు.
అందుకే ‘అక్షరమే అండగా- పరిష్కారమే అజెండాగా’ నిర్వహణ
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్ వేమూరి ఆదిత్య
మరో రూ.కోటితో అభివృద్ధి
పనులు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి హామీ
నెల్లూరు రూరల్ మండలం
సౌత్ మోపూరు గ్రామంలో
ఘనంగా విజయోత్సవ సభ
నెల్లూరు/తిరుపతి, మే 21 (ఆంధ్రజ్యోతి): ‘‘పత్రికలు సమస్యలను ఎత్తిచూపడంతోనే ఆగిపోతున్నాయి. ‘ఆంధ్రజ్యోతి’ మాత్రం మరో అడుగు ముందుకేసింది. సమస్యలను ఎత్తిచూపడమే కాదు.. వాటిని పరిష్కారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని రూపొందించాం. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దీని ద్వారా పలు సమస్యలను పరిష్కరించాం’’ అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూరు గ్రామంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు వేమూరి ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఆదిత్యకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న ప్రహరీ నిర్మాణ పనులను పరిశీలించారు. నూతన బస్ షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొని గ్రామస్థుల స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేమూరి ఆదిత్య మాట్లాడుతూ... సౌత్ మోపూరులో జరిగిన అభివృద్ధి పనులు చూస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపడతామని స్పష్టం చేశారు.
40 రోజుల్లోనే పూర్తి చేశాం: ఎమ్మెల్యే
రూ.కోటితో సౌత్‌మోపూరులో అభివృద్ధి పనులు చేపడతామని జనవరిలో నిర్వహించిన కార్యక్రమంలో హామీ ఇచ్చామని... దీని ప్రకారం 40 రోజుల్లోనే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం మరో రూ.కోటితో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతామని, వచ్చే ఏడాది ఇదే రోజులోపు పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ప్రభుత్వం పాలన సాగిస్తుందంటే అందులో ‘ఆంధ్రజ్యోతి’ది ప్రధాన పాత్ర అని కొనియాడారు. నాడు ప్రజలను తన అక్షరాలతో చైతన్యవంతుల్ని చేసిందన్నారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా తప్పుచేస్తే తాట తీయడానికి ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
విద్యార్థులకు బహుమతులు
పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన సౌత్ మోపూరు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు నలుగురికి వేమూరి ఆదిత్య, కోటంరెడ్డి సోదరులు నగదు బహుమతులను అందజేశారు. ఈ సభలో ‘ఆంధ్రజ్యోతి’ సిబ్బంది, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నేడు తిరుపతి జీవకోనలో...
‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాల విజయోత్సవ సభ గురువారం ఉదయం 10గంటలకు తిరుపతి జీవకోనలో జరుగనుంది. స్థానిక అంబేడ్కర్ కూడలిలోని శ్రీలలితా త్రిపుర సుందరి ఆలయంలోని ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య హాజరవుతున్న సభలో విశిష్ట అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర కమిషనర్ మౌర్య, జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజు పాల్గొంటారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి