Minister Savita: ఆప్కో వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:20 AM
రాష్ట్రంలోని అన్ని ఆప్కో షోరూమ్‌ల్లో వస్త్రాల విక్రయాలపై 40శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.
సంక్రాంతి వరకూ కొనసాగిస్తాం: మంత్రి సవిత
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ఆప్కో షోరూమ్‌ల్లో వస్త్రాల విక్రయాలపై 40శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. చేనేత వస్త్ర వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ డిస్కౌంట్‌ను సంక్రాంతి వరకూ కొనసాగిస్తామని చెప్పారు. దసరా, దీపావళికి డిస్కౌంట్ ఇవ్వడంతో రోజువారీ విక్రయాలు మూడు రెట్లు పెరిగాయన్నారు. అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా రెడీమేడ్ చేనేత వస్త్రాలను సైతం ఆప్కో షోరూమ్‌ల్లో విక్రయిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చేనేత బజార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖ, కర్నూలు తదితర నగరాలతో పాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ చేనేత బజార్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.