Department of Tribal Affairs: ఆది కర్మయోగి ప్రజలకు చేరువ కావాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 06:55 AM
ఆది కర్మయోగి కార్యక్రమంలో భాగంగా.. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మెరుగైన సహకారం, ప్రజలకు చేరువ కావడం, క్షేత్రస్థాయిలో పూర్తి మద్దతు పొందేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ అనంత్ ప్రకాశ్ పాండే సూచించారు
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఆది కర్మయోగి కార్యక్రమంలో భాగంగా.. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో మెరుగైన సహకారం, ప్రజలకు చేరువ కావడం, క్షేత్రస్థాయిలో పూర్తి మద్దతు పొందేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ అనంత్ ప్రకాశ్ పాండే సూచించారు. శుక్రవారం ఆదికర్మయోగి-ప్రతిస్పందన పాలనా కార్యక్రమంపై 22 ప్రభుత్వ శాఖలతో రాష్ట్ర స్థాయి అవగాహన శిక్షణను గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంచడం, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని ప్రోత్సహించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచడం, అలాగే స్పష్టమైన పాత్రలతో గిరిజన వర్గాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. కాగా, రాష్ట్రం నుంచి 8 మంది మాస్టర్ ట్రైనర్లు బెంగళూరులో వారంపాటు శిక్షణ పొందారని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదా భార్గవి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ సరస్వతి మాట్లాడారు.