Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:53 PM

చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలూరుకు చెందిన అక్బర్‌(35) శుక్రవారం మృతిచెందాడు.

 రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అక్బర్‌ (ఫైల్‌)

ఆలూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలూరుకు చెందిన అక్బర్‌(35) శుక్రవారం మృతిచెందాడు. మరో ఇద్దరు గాయాలతో గుంతకల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా... అసిఫ్‌, అక్బర్‌ కలసి పని నిమిత్తం ఆలూరుకు వెళ్లి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. దౌల్తాపురం నుంచి చిప్పగిరికి ద్విచక్రవాహనంపై వస్తున్న ఇబ్రహీం అదుపు తప్పి ఢీకొనడంతో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో అక్బర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్బర్‌ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. చిప్పగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 05 , 2025 | 11:53 PM