Share News

తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:14 AM

తప్పులు లేని ఓటరు జాబి తా తయారీకి సమన్వయంతో పని చేయాలని ఆర్డీవో విశ్వనాథ్‌ సూచించారు.

తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలి
మాట్లాడుతున్న ఆర్డీవో విశ్వనాథ్‌

ఆళ్లగడ్డ, జూన 17(ఆంధ్రజ్యోతి): తప్పులు లేని ఓటరు జాబి తా తయారీకి సమన్వయంతో పని చేయాలని ఆర్డీవో విశ్వనాథ్‌ సూచించారు. మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ని యోజకవర్గంలోని పొలిటికల్‌ పార్టీ ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస వెళ్లిన వారి ఓట్లను బదిలీ చేయడంతో పాటు మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించాలని కోరారు. 18 సం వత్సరాలు నిండిన కొత్త ఓటర్లను నమోదు చేయాలని అధికారు లను ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్‌ జ్యోతి రత్న కుమారి, రెవెన్యూ అధికారులు, పార్టీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అహోబిలంలో యోగాంధ్ర ఏర్పాట్ల పరిశీలన

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో విశ్వనాథ్‌ తెలిపారు. మం గళవారం ఏర్పాట్లను టూరిజం అధికారులతో కలిసి ఆర్డీవో పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాంధ్ర కార్య క్రమంలో కలెక్టర్‌ రాజకుమారి పాల్గొంటారన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ జ్యోతిరత్నకుమారి, అధికారులు ఉన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:14 AM