Share News

మహాత్మాగాంధీకి ఘన నివాళి

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:53 PM

పట్టణంలో గాంధీ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు.

మహాత్మాగాంధీకి ఘన నివాళి
పట్టణంలోని గాంధీవిగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పిస్తున్న ఆర్యవైశ్య సంఘాల నాయకులు

నంద్యాల కల్చరల్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలో గాంధీ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆర్యవైశ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బింగుమళ్ల శ్యామ్‌సుందర్‌ గుప్తా, సంఘం గౌరవాధ్యక్షుడు, కౌన్సిలర్‌ ఖండే శ్యామ్‌సుందర్‌ లాల్‌, జిల్లా సంఘం నాయకులు, కార్యకర్తలు, నంద్యాల ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

బండిఆత్మకూరు : జాతిపిత గాంధీజీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడచుకోవాలని టీజీపీ జిల్లా వైస్‌చైర్మన మనోహర్‌చౌదరి, యువనాయకుడు వడ్డు మధుసూదనరెడ్డి సూచించారు. గురువారం గాంధీ జయంతిని సందర్భంగా పలు గ్రామాల్లో గ్రామ సభలు జరిగా యి. ఏ కోడూరులో టీడీపీ నాయకుడు మధుసూదనరెడ్డి పారిశుధ్య కార్మికులకు పనిముట్లను అందజేశారు. నారాయణాపురంలో ఏపీవో వసుధ ఆధ్వర్యంలో పశువుల షెడ్ల నిర్మాణాలకు భూమి పూజలు చేశా రు. కార్యక్రమాల్లో సర్పంచ జ్ఞానభరణం, టీడీపీ మండల కన్వీనర్‌ కృ ష్ణారెడ్డి, నాయకులు శంకర్‌రెడ్డి, మోహనరెడ్డి, రామచంద్రగౌడ్‌, ఆం బ్రోస్‌, వెంకటసుబ్బయ్య, అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

నందికొట్కూరు: జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని నెలకొల్పేందుకు టీడీపీ ప్రభుత్వం పయనిస్తోందని నందికొట్కూ రు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని మహాత్మాగాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మండలాధ్యక్షులు మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చై ర్మన రబ్బాని, సొసైటీ చైర్మన ముర్తుజావలి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2025 | 11:53 PM