గిరిజన రైతుకు అరుదైన అవకాశం
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:40 PM
మండలంలోని గంపరాయి పంచాయితీ చుండ్రుపుట్టు గ్రామానికి చెందిన గిరిజన రైతు వంజే నాగేశ్వరరావుకు అరుదైన అవకాశం దక్కింది. శుక్రవారం ఢిల్లీలోని ఎర్రకోటలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి నాగేశ్వరరావు ప్రశంసా పత్రాన్ని అందుకోనున్నారు.
నేడు ప్రధాని నుంచి ప్రశంసా పత్రం అందుకోనున్న నాగేశ్వరరావు
పెదబయలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంపరాయి పంచాయితీ చుండ్రుపుట్టు గ్రామానికి చెందిన గిరిజన రైతు వంజే నాగేశ్వరరావుకు అరుదైన అవకాశం దక్కింది. శుక్రవారం ఢిల్లీలోని ఎర్రకోటలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి నాగేశ్వరరావు ప్రశంసా పత్రాన్ని అందుకోనున్నారు. నాగేశ్వరరావు గత ఇరవై ఏళ్లుగా మేలి రకం పసుపు, పిప్పళ్ల పంటను సాగు చేస్తున్నారు. పంట సాగు చేయడంలో మెలకువలు పాటించడమే కాకుండా ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఔషధ మొక్కల అభివృదిఽ్ధ కోసం కూడా తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే గిరిజన వికాస్ సంస్థ ద్వారా ఏర్పాటైనా శ్రీమహిళా వికాస్ మాక్స్ సొసైటీలో కార్యకర్తగా చేరి 600 మంది గిరిజన మహిళలను భాగస్వాములను చేసి పొదుపు, వారి ఆర్థికాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మారుమూల ప్రాంతం నుంచి ఎర్రకోట వరకు చేరి దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోనున్న నాగేశ్వరరావును అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.