Share News

AP High Court: ఏఆర్‌ డెయిరీ ఎండీకి షరతులతో బెయిల్‌

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:14 AM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్‌కు హైకోర్టు పలు షరతులతో మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.

AP High Court: ఏఆర్‌ డెయిరీ ఎండీకి షరతులతో బెయిల్‌

అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్‌కు హైకోర్టు పలు షరతులతో మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. నెల్లూరు ఏసీబీ కోర్టు సంతృప్తి మేరకు రూ. 50 వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడం కానీ, బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తాము విధించిన షరతులను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు కోసం కోర్టును ఆశ్రయించేందుకు సిట్‌కు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు తీర్పు ఇచ్చారు.

Updated Date - Jul 16 , 2025 | 05:14 AM