Share News

Potti Sriramulu పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:40 PM

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. ప్రాణాలు సైతం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఆదివారం పలు ప్రాం తాల్లో ఘనంగా నిర్వహించారు.

Potti Sriramulu పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి సత్యకుమార్‌

ధర్మవరం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. ప్రాణాలు సైతం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఆదివారం పలు ప్రాం తాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద మంత్రి సత్యకుమార్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, అనంతపురం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, బీజేపీ పట్టణ, రూరల్‌ అధ్యక్షులు జింకాచంద్ర, గొ ట్లూరు చంద్ర నివాళులర్పించారు. టీడీపీ నాయకులు ఏపీసీడ్స్‌ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌ కమ తం కాటమయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన బీరే గోపాలక్రిష్ణ, పణికుమార్‌, పురుషోత్తంగౌడ్‌, విశ్వహిందూపరిషత సభ్యులు నివాళులర్పించారు.

Updated Date - Mar 16 , 2025 | 11:40 PM