Share News

వైభవంగా పల్లకీ ఉత్సవం

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:15 AM

లోక కల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో ఆదివారం రాత్రి శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి పల్లకీ ఉత్సవం నిర్వహించా రు.

 వైభవంగా పల్లకీ ఉత్సవం
పల్లకీలో దర్శనమిచ్చిన ఉత్సవమూర్తులు

శ్రీశైలం, అక్టోబరు 5,(ఆంధ్రజ్యోతి): లోక కల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో ఆదివారం రాత్రి శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి పల్లకీ ఉత్సవం నిర్వహించా రు. అర్చకులు సేవా సంకల్పాన్ని పఠించారు. అలాగే మహాగణపతి పూజ చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల కు ప్రత్యేక పూజలు చేసి పల్లకీలో ఊరేగించారు. భక్తులు ఉత్సవమూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీగిరిలో సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైల దేవస్థానం దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఆదివారం సాయంకాలం నాట్యపురి డ్యాన్సు అకాడమి హైదరాబాద్‌ వారు సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. నృత్య కళాకారులు సమితామిశ్ర, జ్యోతిక, ఐశ్వర్య తదితరులు మహాగణపతిం, శివపంచాక్షరి, దేవిస్తుతి, శివతాండవ స్తోత్రం తదితర గీతాలకు, స్తోత్రాలకు నృత్యాన్ని ప్రదర్శించారు. భక్తులు మంత్రముగ్ధులైయ్యా రు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రాచీన సం ప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 06 , 2025 | 12:15 AM