అదనపు జిల్లా జడ్జిలకు ఘనంగా వీడ్కోలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:02 AM
కర్నూలులో ముగ్గురు అదనపు జిల్లా జడ్జిలకు స్థానిక బార్ అసోసియేషన ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

కర్నూలు లీగల్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో ముగ్గురు అదనపు జిల్లా జడ్జిలకు స్థానిక బార్ అసోసియేషన ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి జి.భూపాల్ రెడ్డి, ఆరవ అదనపు జిల్లా జడ్జ్జి పి.పాండురంగారెడ్డిలకు స్థానిక బార్ అసోసియేషన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి మాట్లాడుతూ గత మూడేళ్లుగా న్యాయమూర్తులుగా పని చేస్తూ న్యాయవాదులందరి అభిమానం ఇంత పెద్దఎత్తున జూనియర్, సీనియర్ న్యాయవాదులు హాజరై ఆత్మీయ వీడ్కోలు పలకడం విశేషమని అన్నారు. బదిలీపై వెళ్తున్న అదనపు జిల్లా జడ్జిలు జి.భూపాల్ రెడ్డి, పి.పాండురంగారెడ్డి మాట్లాడుతూ మూడేళ్ల తమ పదవీ కాలంలో కర్నూలు బార్ అసోసియేషన తమకు ఎంతగానో సహకరించిందని, దాని వల్లే తాము కక్షిదారులకు న్యాయాన్ని అందించగలిగామని తెలిపారు. కర్నూలు బార్ అసోసియేషనకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉందని, తాము ఇక్కడకు రాకముందే తెలుసు అని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన అధ్యక్షుడు పి.హరినాథచౌదరి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పాలూరి రవిగువేరా, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, అదనపు జిల్లా జడ్జిలు టి.లీలావతి, ఈ.రాజేంద్రబాబు, లక్ష్మిరాజ్యం, సీనియర్ సివిల్ జడ్జిలు టి.మల్లీశ్వరిలతో పాటు జూనియర్ సివిల్ జడ్జిలు, మెజిస్ర్టేట్లు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరై బదిలీ పై వెల్తున్న జడ్జిలను ఘనంగా సన్మానించారు.