Share News

‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:05 AM

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీ పేరును తొలగించారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు.

‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
మోదీ ఫొటోను దహనం చేస్తున్న వ్యకాస నాయకులు

నందికొట్కూరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీ పేరును తొలగించారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు. శనివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతలూ ఉపాధి హామీ పథకానికి జాతిపిత మహాత్మాగాంధీ పేరును తొలగించి వీబీజీ రామ్‌జీగా పేరు మార్పు చేయడం సరికాదన్నారు. వెంటనే చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి పక్కీర్‌ సాహెబ్‌, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు గోపాలకృష్ణ, రైతు సంఘం నాయకులు బెస్తరాజు, నాగన్న, కర్ణ, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్‌, మహిళా సంఘం కార్యదర్శి సాజిదాబి పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:05 AM