శ్మశానం ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:22 AM
చా గలమర్రి మండ లం చింతల చెరువు గ్రా మంలో దళితులకు శ్మశానం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్య దర్శి బాబాఫకృద్దీన, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాముడు డిమాండ్ చేశారు.
సీపీఐ నాయకుల డిమాండ్ ఫ కలెక్టరేట్ ముందు ఆందోళన
నంద్యాల నూనె పల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : చా గలమర్రి మండ లం చింతల చెరువు గ్రా మంలో దళితులకు శ్మశానం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్య దర్శి బాబాఫకృద్దీన, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాముడు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామస్థులు సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆం దోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చింతల చెరువు గ్రామంలో దళితులకు శ్మశాన వాటిక లేకపోవడంతో మృతి చెందిన వారిని వాగులు, చెట్లు, గుట్ల పక్కన ఖననం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గ్రామంలో అన్ని కులాల వారికి శ్మశా నాలు ఉన్నాయని, ఒక్క దళితులకే ఇంత వరకు శ్మశానం లేకపో వడం శోచనీయమన్నారు. జిల్లా అధికారులు స్పందించి వెంటనే శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని లేకపోతే పెద్దఎత్తున ఉద్య మాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో రాము నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐవైఎఫ్ నాయకులు మధు, పాములేటి, సీపీఐ నాయకుడు ధనుంజయ, గ్రామస్థులు పాల్గొన్నారు.