Share News

7 లక్షల మందిపై భారం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:38 AM

గ్యాస్‌ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపింది. సిలిండర్‌పై రూ.50 పెంచింది. ఫలితంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఏడు లక్షల మంది వినియోగదారులపై ప్రత్యక్షంగా భారం పడుతోంది.

7 లక్షల మందిపై భారం

-గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచిన కేంద్రం

-ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏడు లక్షల కనెక్షన్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గ్యాస్‌ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపింది. సిలిండర్‌పై రూ.50 పెంచింది. ఫలితంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఏడు లక్షల మంది వినియోగదారులపై ప్రత్యక్షంగా భారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 70కి పైగా గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు ఏడు లక్షల వరకు డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్‌కు రూ.50 లెక్కన చూస్తే ప్రతి రెండు నెలలకు రూ.3.50 కోట్ల మేర వినియోగదారులపై అదనంగా భారం పడుతోంది. రెండు నెలలకు ఒక గ్యాస్‌ సిలిండర్‌ చొప్పున ఏడాదికి ఆరు సిలిండర్ల ప్రాతిపదికన చూస్తే రూ. 21 కోట్ల భారం ప్రజలపై పడనుంది.

Updated Date - Apr 10 , 2025 | 12:38 AM