Share News

ఉపాధికి ఊతం

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:16 AM

పాడి పరిశ్రమపై ఆసక్తి కలిగిన ఔత్సాహిక రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ పశు సంపద పథకం(నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన) ఊతంగా మారింది.

 ఉపాధికి ఊతం
పాడి గేదెల యూనిట్‌

- జాతీయ పశు సంపద పథకం పాడి రైతుకు వరం

- యూనిట్‌ స్థాయిని బట్టి రూ.30 లక్షల నుంచి

రూ.కోటి వరకు రుణం

50శాతం సబ్సిడీ

కొలిమిగుండ్ల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : పాడి పరిశ్రమపై ఆసక్తి కలిగిన ఔత్సాహిక రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ పశు సంపద పథకం(నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన) ఊతంగా మారింది. పూర్తిగా ఆనలైన దరఖాస్తులతో ముందుకు సాగే ఈ పథకంపై క్షేత్ర స్థాయిలో పాడి రైతులకు, ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం గమనార్హం. గ్రామాల్లో, పట్టణాల్లో రైతులు ఏర్పాటు చేసే యూనిట్‌ స్థాయి, రైతు అర్హతను బట్టి రూ.30లక్షల నుం చి రూ.కోటి రూపాయల వరకు ఈ పథకం ద్వారా పొందే అవకాశం ఉండటం ఓ వరంగా మారనుంది. రూ.1కోటి రూపాయాల పథకం కోసం రూ.50లక్షల బ్యాంకు గ్యారంటీతో రుణం పొందే అవకాశం కల్పించారు. ఇందులో ప్రభుత్వం 50శాతం సబ్సిడీ అందిస్తుండగా, మి గిలిన 50శాతం యూనిట్‌ ఏర్పాటు చేసిన రైతు చెల్లించాల్సి ఉంటుంది.

పథకం అమలు విధానం

పశు పోషణతో పాటు వివిధ రకాల యూనిట్లు నెలకొల్పి ఈపథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాన్ని కల్పించారు. పశువుల పెంప కం యూనిట్లు, గొర్రెల పెంపకం యూనిట్లు, పశు గ్రాసం కొరత నివారించడానికి ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, విత్తనాల సరఫరా, మాంసం, గుడ్లు, ఉన్ని ఉత్పత్తి లో పరిశోధనలకు ప్రోత్సాహం తదితర యూనిట్లు నెలకొల్ప డం ద్వారా ఉపాధి కల్పించే విధంగా ఈపథకానికి శ్రీకారం చుట్టారు. ఈపథకం దరఖాస్తుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన ఎల్‌ ఎం.యూడీవైఎఎంఐఎంఐటి ఆర్‌ఎ.ఇన వెబ్‌ సైట్లో నేరుగా దర ఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయి కమిటీ దీన్ని క్షుణ్ణంగా పరిశీ లించి, వివిధ శాఖల అధికారులు క్షేత్ర పరిశీలన అనంతరం కేంద్ర కమిటీకి సిఫార్సు చేస్తారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికా రులు దీన్ని పరిశీలించి నిధులు విడుదల చేస్తారు. ఈపథకం కోసం దరఖాస్తుదారులు ఏ ప్రభుత్వ కార్యా లయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి ఎంపి కైన వారు ప్రతి నెలా పశుసంవర్థకశాఖ అధికారులకు ఫొటోలు పంపాల్సి ఉంటుంది. పథకాన్ని దుర్విని యోగం చేయకుండా లబ్ధిదారుడి నుంచి గ్యారంటీ పత్రాన్ని అధికారులు తీసుకుంటారు.

పథకం లబ్ధి కోసం ఉండాల్సిన అర్హతలు

ఈపథకంలో గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల యూనిట్లతో పాటు, పచ్చిమేత యూని ట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. చదువు వయసు తో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించా రు. పథకం పొందే వారు తప్పనిసరిగా సొంత భూమి కలిగి ఉండాలి. ఆధార్‌-ఓటరు గుర్తింపు-పాన కార్డు-డ్రైవింగ్‌ లైసెన్సు వంటి గుర్తింపు కార్డులు. స్థానికత, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు, మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌ పత్రాలు, ఆరునెలల బ్యాంకు స్టేట్‌మెంట్‌, భూమి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, ఏర్పాటు చేయబోయో యూనిట్‌ మొత్తానికి సంబంధించిన నివేదిక వంటి పత్రాలను అందుబాటులో ఉంచుకొని ఆనలైనలో దరఖాస్తు చేసుకోవచ్చు.

నిధులు త్వరగా విడుదల చేయాలి

తమ స్వశక్తితో ఉపాధి పొందాలనుకున్న వారికి చక్కటి ప్రోత్సాహం ఈ పథకం ద్వారా అందు తుంది. ప్రభుత్వం పథ కాన్ని మరింత సుల భతరం చేసి, నిధుల విడుదలలో జాప్యం లేకుండా త్వరితగతిన విడుదల చేయాలి.

- అంబటి విశ్వనాథరెడ్డి, లబ్ధిదారుడు

అవగాహన కల్పించాలి

జాతీయ పశు సం పద పథకం ఎంతో ప్రా ధాన్యతమైనది. అయితే ఈపథకంపై రైతులు, ఇతర వర్గాల్లో సరైన అవగాహన లేదు. నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మి షన పథకం విస్తృత అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉంది.

- నంద్యాల ప్రసాద్‌ యాదవ్‌, పాడి రైతు, మదనంతపురం

ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలి

ఆసక్తి కలిగిన తమ ఇంటి నుండే ఆనలైన ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనలను పూర్తి స్థాయిలో పరిశీలించి పథకాన్ని మంజూరు చేస్తారు. పాడి పరిశ్రమ వృద్ధికి పథకం ఎంతగానో దోహద పడుతుంది.

- గోవిందునాయక్‌, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి

Updated Date - Mar 13 , 2025 | 12:16 AM