లాటరీలో ఒక బార్ ఎంపిక
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:41 AM
జిల్లాలో రెండో విడత నిర్వహించిన బార్‌ల కేటాయింపు లాటరీలో ఒక దానికి వ్యాపారిని అధికారులు ఖరారు చేశారు. డీఆర్‌వో కార్యాలయంలో గురువారం లాటరీ తీశారు. డీఆర్వో, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ కె.చంద్రశేఖరరావు లాటరీ ద్వారా వ్యాపారిని ఎంపిక చేశారు.
-మిగిలిన 11 బార్‌లకు స్పందన కరువు
-లాటరీ తీసి అభ్యర్థిని ఖరారు చేసిన డీఆర్వో
మచిలీపట్నంటౌన్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో రెండో విడత నిర్వహించిన బార్‌ల కేటాయింపు లాటరీలో ఒక దానికి వ్యాపారిని అధికారులు ఖరారు చేశారు. డీఆర్‌వో కార్యాలయంలో గురువారం లాటరీ తీశారు. డీఆర్వో, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ కె.చంద్రశేఖరరావు లాటరీ ద్వారా వ్యాపారిని ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 12 బార్లకు తొలివిడతలో ఎలాంటి దరఖాస్తులు రాలేదు. దీంతో రెండో విడతలో వీటికి ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 17వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఒక బార్‌కు మాత్రమే నిబంధనల ప్రకారం దరఖాస్తులు వచ్చాయి. గుడివాడలోని బార్‌కు మసిముక్కు జలాచంద్రుడు నాలుగు దరఖాస్తులు దాఖలు చేయగా, ఆయనకే బార్ లైసెన్సు దక్కింది. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో నాలుగు, పెడన మునిసిపాలిటీలో ఒకటి, మంగినపూడి బీచ్‌లో ఒకటి, గుడివాడలో ఐదు బార్‌లకు దరఖాస్తులు రాకపోవడంతో వీటిని పక్కనపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ భార్గవ్ పాల్గొన్నారు.