Share News

Yashasvibharti from Tadipatri: ఒక్క తల... 100 ట్యూబ్‌లైట్లు...!

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:43 AM

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక యశస్విభారతి 6.9 నిమిషాల్లో తలపై 100 ట్యూబ్‌లైట్లను పగులగొట్టించుకుని ఔరా అనిపించింది....

Yashasvibharti from Tadipatri: ఒక్క తల... 100 ట్యూబ్‌లైట్లు...!

తలపై పగలగొట్టించుకుని తొమ్మిదేళ్ల బాలిక సాహసం

తాడిపత్రి, నవంబరు9(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక యశస్విభారతి 6.9 నిమిషాల్లో తలపై 100 ట్యూబ్‌లైట్లను పగులగొట్టించుకుని ఔరా అనిపించింది. యశస్వి స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునే లక్ష్యంతో తాడిపత్రిలోని కృష్ణాపురం జీరో రోడ్డులో ఆదివారం ఈ ఫీట్‌ చేసింది. యశస్విభారతి తల్లిదండ్రులు రంగనాథ, పద్మజ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీడియోలు, ఫొటోలను నోబుల్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్స్‌ రికార్డ్స్‌ కమిటీకి పంపనున్నట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

Updated Date - Nov 10 , 2025 | 04:43 AM