AP Govt: 847 సంఘాలకు త్రిసభ్య కమిటీలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:56 AM
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా మరికొన్ని వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం...
అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా మరికొన్ని వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం అధికారేతర పర్సన్ ఇన్‌చార్జి(త్రిసభ్య) కమిటీలను నియమించింది. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 819 సహకార సంఘాలకు నియమించిన అధికారేతర పర్సన్ ఇన్‌చార్జి కమిటీలు వచ్చే జనవరి 30 వరకు కొనసాగనుండగా, తాజాగా 821 సంఘాలకు నియమించిన కమిటీలు జనవరి 30 వరకు ఉంటాయని పేర్కొంది. కాగా మరో 26 సంఘాలకు అక్టోబరు 30 వరకు అధికారేతర పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను నియమించింది.