Excise Department: 840 బార్లు... 19 దరఖాస్తులే
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:38 AM
ఎక్సైజ్‌శాఖ విడుదల చేసిన నూతన బార్ పాలసీకి స్పందన కరువైంది. రాష్ట్రంలోని 840 బార్లకు ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయగా...
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌శాఖ విడుదల చేసిన నూతన బార్ పాలసీకి స్పందన కరువైంది. రాష్ట్రంలోని 840 బార్లకు ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయగా, శుక్రవారం వరకు ఐదు రోజుల్లో 19 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వివిధ జిల్లాల్లో సుమారు 250 మంది ప్రాసెసింగ్ ఫీజు రూ.10వేలు చెల్లించి రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. వారిలో 19 మంది మాత్రమే రూ.5 లక్షలు చెల్లించి తుది దరఖాస్తులు సమర్పించారు. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ పలు మార్పులు చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి బార్‌కు 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. ఫీజు వెనక్కి ఇవ్వరు. దీనిపై వ్యతిరేకత రావడంతో ఆ నిబంధనను సవరించారు. లాటరీ తీయకపోతే దరఖాస్తుదారులకు ఫీజు వెనక్కి ఇస్తామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్‌కుమార్ ప్రకటించారు.