Share News

IAS Training: నేటి నుంచి ముస్సోరిలో 8 మంది ఐఏఎస్‌లకు శిక్షణ

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:38 AM

మిడ్‌ కేరీర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రం నుంచి ఎనిమిది మంది సీనియర్‌ ఐఏఎస్‌లు ముస్సోరి బయలుదేరి వెళ్లారు.

 IAS Training: నేటి నుంచి ముస్సోరిలో 8 మంది ఐఏఎస్‌లకు శిక్షణ

  • కృష్ణా, అనంత జేసీలకు ఇన్‌చార్జి కలెక్టర్లుగా బాధ్యతలు

అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మిడ్‌ కేరీర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రం నుంచి ఎనిమిది మంది సీనియర్‌ ఐఏఎస్‌లు ముస్సోరి బయలుదేరి వెళ్లారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 16 వరకు వారు లాల్‌బహుదూర్‌ శాస్త్రి అకాడమీలో శిక్షణ తీసుకొనున్నారు. కృష్ణా, అనంతపురం కలెక్టర్ల స్థానంలో ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు ఇన్‌చార్జి కలెక్టర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కే.మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jul 20 , 2025 | 04:44 AM