Share News

Veterinary Director: 75శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలు

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:25 AM

రాష్ట్రంలోని పాడి పశువుల్లో పాల దిగుబడి పెంపుతో పాటు పునరుత్పత్తి సామర్థ్యం పెంపుదల కోసం ఈ ఏడాది రూ.28.54 కోట్లతో పశుపోషకులకు 75శాతం రాయితీతో 3,622 టన్నుల పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు తెలిపారు.

Veterinary Director: 75శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలు

  • పంపిణీకి సిద్ధంగా 3,622 టన్నులు: వెటర్నరీ డైరెక్టర్‌

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాడి పశువుల్లో పాల దిగుబడి పెంపుతో పాటు పునరుత్పత్తి సామర్థ్యం పెంపుదల కోసం ఈ ఏడాది రూ.28.54 కోట్లతో పశుపోషకులకు 75శాతం రాయితీతో 3,622 టన్నుల పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభమైన పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా ఆయన ఓ ప్రకటన చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 72,440 హెక్టార్లలో సాగు చేయడానికి పంపిణీ చేస్తున్న 3,622 టన్నుల పశుగ్రాస విత్తనాల ద్వారా 18.11 లక్షల టన్నుల పశుగ్రాసం ఉత్పత్తి అవుతుంది. ఏకవార్షిక పశుగ్రాసాల్లో 2-3 కోతలొచ్చే పశుగ్రాసాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎకరానికి 10-15 కిలోల విత్తనాలు వేయాల్సి ఉంటుంది. 45 రోజులకోసారి కోతతో ఎకరానికి 16-20 టన్నుల పచ్చిగడ్డి లభిస్తుంది. బహువార్షిక గడ్డి జాతి విత్తనాలు నాటిన 70 రోజులకు తొలి కోత కోశాక, ప్రతి 40-45 రోజులకో కోతతో ఏటా ఎకరానికి 60 టన్నుల పచ్చిగడ్డి వస్తుంది. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో 100శాతం రాయితీపై పశుగ్రాసాల పెంపకానికి అవకాశం ఉంది. పశుపోషకులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి’ అని దామోదర్‌ నాయుడు కోరారు.

Updated Date - Jul 08 , 2025 | 05:27 AM