Share News

Visakhapatnam: 7 కిలోల బంగారం.. 5 కోట్లతో అలంకరణ

ABN , Publish Date - Oct 01 , 2025 | 05:20 AM

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు కిలోల బంగారు...

Visakhapatnam: 7 కిలోల బంగారం.. 5 కోట్లతో అలంకరణ

  • శ్రీమహాలక్ష్మిగా కన్యకాపరమేశ్వరి అమ్మవారు

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు కిలోల బంగారు ఆభరణాలతో మహాలక్ష్మిగా అలంకరించారు. బంగారు చీర, స్వర్ణ కిరీటం, బంగారు పాదాలు, 12 కిలోల వెండి వస్తువులను అలంకరణకు వినియోగించారు. ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీతో తోరణాలు కట్టి, మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మూల విరాట్‌కు 108 సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం చేసి, 108 స్వర్ణ పుష్పాలతో పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆరిశెట్టి దినకర్‌ మాట్లాడుతూ 23 ఏళ్లుగా అమ్మవారిని అలంకరిస్తున్నామని చెప్పారు.

- విశాఖపట్నం (మహారాణిపేట), ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 01 , 2025 | 05:21 AM