Sunita: న్యాయం కోసం ఆరేళ్లుగా పోరాటం
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:57 AM
వివేకా 6వ వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా పులివెందులలో ఉన్న వివేకా సమాధి వద్ద కుటుంబంతో సహా ఆమె నివాళులు అర్పించారు. అనంతరం భర్త రాజశేఖర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘

న్యాయం లభిస్తుందన్న నమ్మకముంది
సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు
వారిని రాష్ట్ర ప్రభుత్వమే రక్షించాలి
నిందితుల్లో ఒక్కరు తప్ప అందరూ
బయట స్వేచ్ఛగానే జీవిస్తున్నారు: సునీత
పులివెందుల, మార్చి 15(ఆంధ్రజ్యోతి): తన తండ్రి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఆరేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని కుమార్తె సునీత పేర్కొన్నారు. తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న ఆశ ఉందన్నారు. శనివారం వివేకా 6వ వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా పులివెందులలో ఉన్న వివేకా సమాధి వద్ద కుటుంబంతో సహా ఆమె నివాళులు అర్పించారు. అనంతరం భర్త రాజశేఖర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘ఆరు సంవత్సరాలుగా న్యాయం కోసం ఎంత పోరాటం చేస్తున్నామో అందరూ చూస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఒక్కరు తప్ప అందరూ బయటే ఉన్నారు. స్వేచ్ఛగా బతుకుతున్నారన్నారు. సీబీఐ విచారణలు ఆగిపోయాయి. కోర్టు విచారణలు ఇంకా మొదలే కాలేదు. వివేకానందరెడ్డి అంతటి వారికే ఇంత అన్యాయం జరుగుతుంటే.. సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది. మా న్యాయ పోరాటం ఆగేదే లేదు. కచ్చితంగా పోరాటం సాగిస్తాం. నిందితుల కంటే ఎక్కువ శిక్ష మేము, మా కుటుంబ సభ్యులే అనుభవిస్తున్నారు. ఇది న్యాయమా?. కానీ, కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. సీబీఐ మళ్లీ విచారణ మొదలుపెడుతుందన్న నమ్మకం ఉంది. నిందితులకు కోర్టు శిక్ష విధిస్తుంది. ఇవన్నీ జరిగేలా ఆయా సంస్థలను నేను ఎంతో ప్రాఽథేయపడుతున్నా. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్‌లో ఎన్నో లోపాలు జరిగాయి. నిందితులకు వీటి నుంచి తప్పించుకునేందుకు బాగా తెలుసు. అందుకే ఇంకా న్యాయం జరగలేదు’’ అని సునీత అన్నారు. వివేకా కేసు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెప్పారు.
అయితే, వివేకా కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని ఇలాంటి సమయంలో వారికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నట్టు తెలిపారు. సాక్షుల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు, వారికి భద్రత కూడా కల్పించాలని కోరారు. సాక్షులుగా ఉన్న వారిపై చాలా ఒత్తిళ్లు తెస్తున్నారని, ఇలాంటి చర్యలపైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సునీత విజ్ఞప్తి చేశారు.
వివేకాకు కుటుంబ సభ్యుల నివాళి
వివేకానందరెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు సుధీకర్‌రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి తదితరులు సమాధుల తోటకు వచ్చారు. వివేకా సమాధిపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గవర్నర్‌తో సునీత భేటీ
రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో వివేకా కు మార్తె సునీత శనివారం సాయంత్రం భేటీ అ య్యా రు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన ఆమె సు మారు 15 నిమిషాల పాటు గవర్నర్‌తో చర్చించారు. తన తండ్రి వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలని విన్నవించారు. తన తం డ్రి హత్య జరిగి ఆరేళ్లు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు విచారణ పూర్తి కాలేదని వివరించారు. హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను ఆమె గవర్నర్‌కు వివరించారు. హత్య కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు.