Share News

Aadhaar Seeding: 5.44 లక్షల మంది రైతులకు ఆధార్‌ సీడింగ్‌ ఫీజు మినహాయింపు

ABN , Publish Date - Oct 28 , 2025 | 06:43 AM

వెబ్‌ల్యాండ్‌లో రైతుల సాగు భూముల ఆధార్‌ సీడింగ్‌లో లోపాలు సరిదిద్దేందుకు వీలుగా మీ-సేవ ఫీజు 50 రూపాయలు మినహాయింపు ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 Aadhaar Seeding: 5.44 లక్షల మంది రైతులకు ఆధార్‌ సీడింగ్‌ ఫీజు మినహాయింపు

  • వెబ్‌ల్యాండ్‌లో తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): వెబ్‌ల్యాండ్‌లో రైతుల సాగు భూముల ఆధార్‌ సీడింగ్‌లో లోపాలు సరిదిద్దేందుకు వీలుగా మీ-సేవ ఫీజు 50 రూపాయలు మినహాయింపు ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్‌ల్యాండ్‌ పరిధిలోని రికార్డుల్లో 5.44 లక్షల మంది రైతుల భూముల రికార్డులతో ఆధార్‌ డేటా సరిగ్గా లేదు. కొందరు ఇతరుల ఆధార్‌ను సీడింగ్‌ చేయగా, మరికొందరు తప్పుగా చేశారు. దీని వల్ల ఆ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి ప్రయోజనం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆ రైతులకు ఒకసారి అవకాశం ఇచ్చి వెంటనే మీ-సేవా కేంద్రాల ద్వారా ఆధార్‌ సీడింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కోరుతున్నాయి. రైతులకు ఊరట కల్పించేందుకు మీ-సేవలో చెల్లించే ఆధార్‌ సీడింగ్‌ ఫీజు 50 రూపాయలను మినహాయింపు ఇస్తూ సోమవారం రెవెన్యూ శాఖ ఇన్‌చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో ఆధార్‌ తప్పున్న 5.44 లక్షల మంది రైతులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏనే ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కసారి ఫీజు మినహాయింపు వల్ల సర్కారుకు 2.72 కోట్ల భారం పడనుంది.

Updated Date - Oct 28 , 2025 | 06:44 AM