Panchayat Raj Department: 53 మంది ఎంపీడీవోలకు డీఎల్‌డీవోలుగా పదోన్నతి
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:23 AM
సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీ కార్యదర్శి నుంచి డీఎల్‌డీవోల దాకా పదోన్నతు లు వేగవంతమయ్యాయి. తాజాగా 53 మంది ఎంపీడీవోలకు డీఎల్‌డీవోలుగా (
మరో 158 మంది ఎంపీడీవోలుగా.. డీపీసీ ఆమోదం
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీ కార్యదర్శి నుంచి డీఎల్‌డీవోల దాకా పదోన్నతు లు వేగవంతమయ్యాయి. తాజాగా 53 మంది ఎంపీడీవోలకు డీఎల్‌డీవోలుగా (డివిజనల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్) పదోన్నతి లభించింది. వీరితో పాటుగా 98 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, 56 జడ్పీ ఏవోలు, డీఎల్‌పీవో కార్యాలయంలోని నలుగురు ఏవోలు మొత్తం 158 మందికి ఎంపీడీవోలుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు పదోన్నతుల కమిటీ(డీపీసీ) సమావేశమై శుక్రవారం ఆమోదించింది. పదోన్నతులు కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి ఏపీ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు వరప్రసాద్, వెంకట్రావు, కేఎన్‌వీ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు కృషి చేసిన ఉపముఖ్యమంత్రి ఓఎస్డీ వెంకట కృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.