IT Secretary Katanneni Bhaskar: ఏటా 5 వేల మందికి క్వాంటమ్ శిక్షణ
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:28 AM
రాష్ట్రంలో 2030 నాటికి ఏటా ఐదు వేల మందికి క్వాంటమ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీశాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించారు.
కలెక్టర్ల సదస్సులో ఐటీ శాఖ కార్యదర్శి వెల్లడి
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2030 నాటికి ఏటా ఐదు వేల మందికి క్వాంటమ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీశాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, యువతకు అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా 2030 నాటికి ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు. క్వాంటమ్ వ్యాలీ కి సంబంధించి ఇప్పటికే రూ. 2,847 కోట్ల పెట్టుబడులతో 29 ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ హార్డ్ వేర్ రంగంలోనూ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఇందుకోసం మరో 200 ఎకరాలు సేకరిస్తున్నామన్నారు. ఐబీఎం నుంచి రెండు క్వాంటమ్ కంప్యూటర్లు రానున్నాయన్నారు. క్వాంటమ్ వ్యాలీ భవనాలు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. రాష్ట్రంలో రూ. 2,97,707 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయన్నారు. రాష్ట్రంలో 6.5 గిగావాట్ డేటా సామర్థ్యాని సాధించడమే లక్ష్యమని తెలిపారు.