Minister Vasamsetti Subhash: అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి
ABN , Publish Date - Jul 08 , 2025 | 06:26 AM
అమరావతిలో 500 పడకల ఈఎ్‌సఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, దీనికోసం సీఆర్‌డీఏ 25 ఎకరాల స్థలాన్ని గుర్తించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి
రాజమహేంద్రవరం, జూలై 7(ఆంధ్రజ్యోతి): అమరావతిలో 500 పడకల ఈఎ్‌సఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, దీనికోసం సీఆర్‌డీఏ 25 ఎకరాల స్థలాన్ని గుర్తించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన ఈఎ్‌సఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. ఇక్కడ 191 పోస్టుల్లో 97 రెగ్యులర్, 94 అవుట్ సోర్సింగ్ విధానంలో మంజూరయ్యాయని చెప్పారు. గుంటూ రు, శ్రీసిటీ, కర్నూలు, పెనుగొండలలో కొత్త ఈఎ్‌సఐ ఆసుపత్రుల నిర్మాణం కోసం భూములు గుర్తించామన్నారు. రాష్ట్రంలో 30 కొత్త ఈఎ్‌సఐ డిస్పెన్సరీలకు ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. పలు ఆసుపత్రుల్లో వివిధ కేటగిరీల్లో ఉన్న 580 పోస్టులను రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.